ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను కచ్చితంగా చంపుతామని కెనడియన్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్(Goldy Brar) తెలిపాడు. ఓ ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఈ విషయాన్ని చెప్పాడు. సల్మాన్‌ను బెదిరిస్తూ కొన్ని రోజుల క్రితం అతనికి ఈమెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలాను హత్య చేసింది గోల్డీ బ్రార్ గ్యాంగే. భాయ్ సాహెబ్(లారెన్స్) ఎవర్నీ క్షమించలేది లేదన్నాడని, దయ అవసరం అనుకున్నప్పుడు దయ చూపిస్తామని బ్రార్ పేర్కొన్నాడు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో గోల్డీ బ్రార్ కీలక సభ్యుడు. సల్మాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యమని లారెన్స్ బిష్ణోయ్ గతంలో చెప్పాడు. సల్మాన్ ఒక్కడే కాదు.. శత్రువుల్ని ఎవర్నీ వదిలేది లేదని గోల్డీ బ్రార్ తెలిపాడు. సల్మాన్‌కు బెదిరింపు మెయిల్స్ వచ్చిన ఘటనలో మార్చిలో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.