గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘స్వాతి ముత్యం’. ఈ సినిమా మంచి ఆదరణ పొందుతున్నదని నిర్మాత, హీరో గణేష్ తండ్రి బెల్లంకొండ సురేష్ అన్నారు. దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ, గణేష్తో కలిసి కార్యక్రమం నిర్వహించారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ…‘రెండు పెద్ద చిత్రాల మధ్య విడుదలైనా మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. శుక్రవారం నుంచి వసూళ్లు పుంజుకున్నాయి. మాకు స్థిరమైన విజయం దక్కింది. కుటుంబంలోని భావోద్వేగాలు, వినోదం కలగలిపి దర్శకుడు ఆకట్టుకునేలా సినిమా రూపొందించారు. ‘గాడ్ ఫాదర్’ ప్రచార కార్యక్రమంలో చిరంజీవి గారు మా అబ్బాయి సినిమాను ఆదరించమని చెప్పడం ఆయన పెద్ద మనసుకు నిదర్శనం’ అన్నారు.