వెండితెరతో పాటు బుల్లితెర,డిజిటల్ మీడియాలో సందడి చేస్తున్న అందాల ముద్దుగుమ్మ తమన్నా(Tamannah) . ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానెల్ జెమినీ టీవీలో ‘మాస్టర్ చెఫ్’ (master chef) అనే కార్యక్రమం చేస్తుంది. తమన్నాతో ఈ షోకు రేటింగ్ రాకపోవడం.. ఆమె యాంకరింగ్ అంతగా బాగా లేదన్న విమర్శల నేపథ్యంలో ఆమె స్థానంలో అనూసూయని తీసుకున్నారు.
తమన్నాని తొలగించడం పట్ల అనేక ప్రచారాలు నడిచాయి. ఈ క్రమంలో మాస్టర్ చెఫ్ నిర్వాహకులు దీనిపై వివరణ ఇస్తూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. తమన్నా ‘మాస్టర్ చెఫ్’లో హోస్ట్ చేసేందుకు రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నామని నిర్వాహకులు తెలిపారు. జూన్ 24 నుంచి సెప్టెంబర్ చివరి వరకు మొత్తం 18 రోజులు షోకు హోస్ట్ గా ఉండాలని అగ్రిమెంట్ చేసుకున్నాం.
ఆమెకున్న ఇతర పనుల వలన 18 రోజులలో కేవలం 16 రోజులు మాత్రమే వచ్చింది. ఆ రెండు రోజులు తమన్నా రాకపోవడంతో 300 మంది టెక్నిషియన్లు పనిచేస్తున్న ఈ షోకు రూ. 5 కోట్లు నష్టం వచ్చిందని చెబుతున్నారు. అప్పటికే తమన్నాకు 1. 5 లక్షల రూపాయలు ఇచ్చామని, మిగతా రోజుల షూటింగ్ కూడా పూర్తి చేసుంటే మొత్తం డబ్బులు చెల్లించేవారమని వారు పేర్కొన్నట్లు సమాచారం.