వినోదాల ‘వాంటెడ్ పండుగాడ్’
సునీల్, అనసూయ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ పతాకంపై సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మిస్తున్నారు. ఈ నెల 19న విడుదలకానుంది. ఆదివారం ప్రీరిలీజ్ వేడుక జరిగింది. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘సీతారామం, బింబిసార, కార్తికేయ-2 సినిమాలు సాధించిన విజయాలతో తెలుగు ఇండస్ట్రీకి పూర్వవైభవం వచ్చింది. మా చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు. ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్స్ అందరూ భాగం కావడంతో కావాల్సినంత వినోదం పండిందని సునీల్ పేర్కొన్నారు. ఈ సినిమా ద్వారా మంచి హిట్ కొట్టబోతున్నామని దర్శకుడు శ్రీధర్ సీపాన తెలిపారు. రాఘవేంద్రరావు సినిమాలు చూస్తూ పెరిగామని, ఆయన నిర్మిస్తున్న చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని సుడిగాలి సుధీర్ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు హరీష్‌శంకర్, బీవీఎస్ రవి, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

