Mega 154 | ‘సోలోమాన్ సీజర్’గా బాబీ సింహా.. ‘వాల్తేరు వీరయ్య’ స్పెషల్ పోస్టర్ రిలీజ్..!
Waltair Veerayya Movie | ఈ ఏడాది 'ఆచార్య'తో మంచి శుభారంభం దక్కకపోయినా, ఇటీవలే రిలీజైన 'గాడ్‌ఫాదర్'తో తిరిగి కంబ్యాక్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా కానుకగా రిలీజై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది.
Waltair Veerayya Movie | ఈ ఏడాది ‘ఆచార్య’తో మంచి శుభారంభం దక్కకపోయినా, ఇటీవలే రిలీజైన ‘గాడ్‌ఫాదర్’తో తిరిగి కంబ్యాక్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా కానుకగా రిలీజై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఫైనల్‌గా బ్రేక్ ఈవెన్ సాధించలేక పోయింది. ప్రస్తుతం చిరు, బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి బాబీ సింహా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
నేషనల్ అవార్డు విన్నర్ బాబీ సింహా వాల్తేరు వీరయ్యలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బాబీ సింహా సోలోమాన్ సీజర్గా నటించనున్నాడు. ఆదివారం బాబీసింహా పుట్టిన రోజు సందర్భంగా వాల్తేరు వీరయ్యలోని లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నాడు. చిరుకు జోడీగా శృతిహాసన్ నటిస్తుంది. ఈ చిత్రంలో చిరు యూనియన్ లీడర్‌గా కనిపించనున్నట్లు టాక్. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ సంస్థ నిర్మిస్తుంది.
Team #WaltairVeerayya wishes 'Solomon Caesar' aka National Award winning actor @actorsimha a very Happy Birthday 💥
Megastar @KChiruTweets Mass Maharaja @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/z2V3b7wDi7
— Mythri Movie Makers (@MythriOfficial) November 6, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

