Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే కానుక అందించేందుకు ‘ఫౌజీ’ చిత్రబృందం సిద్ధమవుతోంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రత్యేక వీడియో గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ వెల్లడించారు. మౌళి
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే కానుక అందించేందుకు ‘ఫౌజీ’ చిత్రబృందం సిద్ధమవుతోంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రత్యేక వీడియో గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ వెల్లడించారు. మౌళి హీరోగా నటించిన ‘దొంగ నా కొడుకు’ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వివరాలు పంచుకున్నారు. ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఇప్పటివరకు ఈ సినిమా కథాంశం, ప్రభాస్ పాత్రకు సంబంధించిన వివరాలు పూర్తిస్థాయిలో బయటకు రాలేదు.
ఈ నేపథ్యంలో పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్న గ్లింప్స్‌లో కథకు సంబంధించిన కీలక అంశాలను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.సినిమా ప్రధాన కథాంశం ఏమిటి? కథ ఏ నేపథ్యంలో సాగుతుంది? ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోంది? వంటి విషయాలపై ప్రేక్షకులకు అవగాహన కల్పించేలా ఈ వీడియోను రూపొందించినట్లు రవిశంకర్ తెలిపారు. ఈ గ్లింప్స్ ద్వారా సినిమాలో ప్రభాస్ పాత్ర స్వభావం, కథలోని ప్రధాన అంశాలపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యే వీడియోపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవద్దని రవిశంకర్ సూచించారు.
ఇది సినిమా మొత్తాన్ని పరిచయం చేసే పెద్ద వీడియో కాదని, కేవలం కథా నేపథ్యాన్ని, హీరో పాత్రను తెలియజేసే చిన్న గ్లింప్స్ మాత్రమేనని వివరించారు. అక్టోబర్ 23న విడుదల కానున్న ఈ ప్రత్యేక వీడియో కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్లింప్స్‌లో ఎలాంటి సన్నివేశాలు చూపించనున్నారు? ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోంది? అనే అంశాలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

