Vyooham | సస్పెన్స్, సెంటిమెంట్‌తో వ్యూహం వెబ్‌సిరీస్.. స్టోరీ ఏంటంటే..
Vyooham | ‘సస్పెన్స్, సెంటిమెంట్ ఒక ఒరలో ఇమడవు’ అని సినీ ప్రాథమిక సూత్రం. ఈ ఫార్ములాను అతిక్రమించి ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌లు నిర్మిస్తున్నారు దర్శకులు. శశికాంత్ పీసపాటి దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ రికార్డు స్ట్రీమింగ్ సొంతం చేసుకుంటున్నది.
Vyooham | వ్యూహం (వెబ్‌సిరీస్)
ప్రైమ్ వీడియో: డిసెంబర్ 14
నటీనటులు: సాయి సుశాంత్ రెడ్డి, చైతన్య కృష్ణ, పావని గంగిరెడ్డి, రవీంద్ర తదితరులు
దర్శకత్వం: శశికాంత్ పీసపాటి
‘సస్పెన్స్, సెంటిమెంట్ ఒక ఒరలో ఇమడవు’ అని సినీ ప్రాథమిక సూత్రం. ఈ ఫార్ములాను అతిక్రమించి ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌లు నిర్మిస్తున్నారు దర్శకులు. శశికాంత్ పీసపాటి దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ రికార్డు స్ట్రీమింగ్ సొంతం చేసుకుంటున్నది. ఎనిమిది ఎపిసోడ్స్‌గా తయారైన ‘వ్యూహం’ కథలోకి వెళ్తే.. ఐపీఎస్ అధికారి అర్జున్ రామచంద్ర (సాయి సుశాంత్ రెడ్డి) కొత్తగా విధుల్లో చేరుతాడు. అతని తల్లి వాణి ఐపీఎస్‌గా సేవలు అందిస్తుంది. అర్జున్ పదేండ్లు ఉన్నప్పుడు తన ముందే ఆమెను నక్సలైట్లు కాల్చి చంపుతారు. తల్లిని స్ఫూర్తిగా తీసుకున్న అర్జున్ పోలీసు అధికారి అవుతాడు. ఇదిలా ఉండగా మైఖేల్ (చైతన్య కృష్ణ), జెస్సికా (పావని గంగిరెడ్డి) భార్యాభర్తలు. గర్భిణిగా ఉన్న జెస్సికను చెకప్ కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్తుంటే ఒక కారు వాళ్లను ఢీ కొడుతుంది.
ఇద్దరికీ తీవ్రగాయాలు అవుతాయి. జెస్సికా గర్భం కోల్పోతుంది. పోలీసులు మామూలు హిట్ అండ్ రన్ కేసుగా తేల్చేస్తారు. అయితే, మైఖేల్ మాత్రం ఒప్పుకోడు. అర్జున్ను కలుస్తాడు. ప్రమాదం జరగడానికి ముందు కూడా వరుసగా మూడుసార్లు ఎవరో తమను అటకాయించారని చెబుతాడు. ఇది మామూలు హిట్ అండ్ రన్ కేసు కాదని దీనివెనుక ఏదో కుట్ర కోణం ఉందని గ్రహిస్తాడు అర్జున్. ఈ కేసు పరిశోధనలో ఉండగానే ఓ జర్నలిస్ట్ దారుణహత్యకు గురవుతుంది. ఆమె హత్యకు, యాక్సిడెంట్ కేసుకు ఏదైనా లింక్ ఉందా, ఇంతకీ మైఖేల్‌ను టార్గెట్ చేసిన వాళ్లు ఎవరు? వాళ్ల వెనుక ఎవరున్నారు? ఈ కేసును రామచంద్ర ఎలా పరిష్కరించాడన్నది మిగిలిన కథ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

