Vyjayanthi Movies | క్రికెట్ బెట్టింగ్ వివాదంపై స్పందించిన వైజయంతీ మూవీస్
Nilesh Chopra | ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్‌కి సంబంధించి ఒక వ్యక్తి అరెస్ట్ అవ్వగా.. ఆ వ్యక్తి వైజయంతీ మూవీస్‌కి చెందినవాడనే వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది వైజయంతీ సంస్థ.
Vyjayanthi Movies – Nilesh Chopra | ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ నీలేష్ చోప్రా అనే వ్యక్తి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ వ్యక్తి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌కి చెందిన వ్యక్తి అని.. వార్తలు బయటికి వచ్చాయి. దీంతో తాజాగా ఈ వార్తలను ఖండిస్తూ.. వైజయంతీ బ్యానర్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.
నీలేష్ చోప్రా అనే వ్యక్తిని ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించినందుకు ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మా దృష్టికి వచ్చింది. అలా చెప్పబడుతున్న వ్యక్తి వైజయంతి మూవీస్ ఆఫీస్‌లో ఎప్పుడూ పని చేయలేదు. అతనితో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం గురించి ఎస్ఆర్ నగర్ సంబంధిత పోలీసు అధికారులతో మేము ఇప్పటికే మాట్లాడాం. ఏదైనా వార్తని ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని మీడియాను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము అంటూ వైజయంతీ మూవీస్ రాసుకోచ్చింది. ఇదిలావుంటే నీలేష్ చోప్రా వైజయంతీ మూవీస్‌కి చెందినవాడని అతడి కేసుకి సంబంధించిన ఎఫ్ఐఆర్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
It has come to our notice that a person named Nilesh Chopra had been arrested by SR Nagar Police for online gambling.
THE SAID INDIVIDUAL HAS NEVER WORKED WITH US AT VYJAYANTHI MOVIES OFFICE AND WE ARE UNAWARE OF ANY ASSOCIATION WITH HIM IN ANY OTHER FORM.
We have formally…
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 6, 2025
ఈ ఫాక్ట్స్ సరిపోతాయా అరెస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు కూడా కావాలా? https://t.co/jkYeE8eDeE pic.twitter.com/i0Yu9i4bkM
— Telugu Scribe (@TeluguScribe) February 6, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

