Vrushakarma | అక్కినేని నాగచైతన్య అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వృషకర్మ’ కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ‘విరూపాక్ష’తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విభిన్నమైన కథాంశం, మైథలాజికల్ అంశాలు, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. తాజాగా సినిమా విడుదల తేదీకి సంబంధించిన ఆసక్తికరమైన ప్రకటనను చిత్రబృందం చేసింది. నాగచైతన్య, హీరోయిన్ మీనాక్షి చౌదరి, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కలిసి కనిపించే సరదా వీడియోను విడుదల చేసిన మేకర్స్.. సెప్టెంబర్ 10 సాయంత్రం ‘వృషకర్మ’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
‘వృషకర్మ’కు సంబంధించిన రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో మేకర్స్ ఈ సర్ప్రైజ్ ఇచ్చారు. నాగచైతన్య, మీనాక్షి చౌదరి, బీవీఎస్ఎన్ ప్రసాద్ మధ్య సరదా సంభాషణతో రూపొందించిన వీడియో ద్వారా విడుదల తేదీ ప్రకటనపై క్లారిటీ ఇచ్చారు.అంటే సెప్టెంబర్ 10 సాయంత్రం ఈ సినిమాను ఎప్పుడు థియేటర్లలోకి తీసుకురాబోతున్నారనే విషయంపై అధికారికంగా స్పష్టత రానుంది. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 3, 2026న ‘వృషకర్మ’ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తేదీపై ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు.
అదే తేదీకి ముందుగా ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ ను విడుదల చేయాలని భావించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ సినిమా నిర్మాణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తికాకపోవచ్చనే వార్తలు రావడంతో విడుదల వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3 తేదీని ‘వృషకర్మ’కు కేటాయించే అవకాశాలు ఉన్నాయనే చర్చ మొదలైంది. అయితే అసలు విష నేటి రేపటి అధికారిక ప్రకటనతో తేలిపోనుంది. ‘వృషకర్మ’ నాగచైతన్య కెరీర్లో మరో విభిన్నమైన ప్రయత్నంగా నిలవనుంది. ఇప్పటివరకు ఎక్కువగా ప్రేమకథలు, కుటుంబ కథలు, యాక్షన్ ఎంటర్టైనర్లలో కనిపించిన నాగచైతన్య.. ఈసారి మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్‌లో కనిపించనున్నారు. దర్శకుడు కార్తీక్ దండు కథను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు, సినిమా నేపథ్యంపై ఉన్న సమాచారం సూచిస్తోంది. మైథలాజికల్ అంశాలను ఆధునిక యాక్షన్ ఎలిమెంట్స్‌తో మిళితం చేస్తూ కొత్త తరహా అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.