Vismaya | మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కూతురు విస్మయ మోహన్‌లాల్ సినీ ఎంట్రీ ఇచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘తుడక్కం’ విడుదలకు ముందే భారీ ఆసక్తిని క్రియేట్ చేసింది. ముఖ్యంగా విస్మయ తొలిసారి బిగ్ స్క్రీన్‌పై కనిపించడంతో ఈ సినిమాపై మలయాళ ప్రేక్షకుల్లోనే కాకుండా ఇతర భాషల సినీ అభిమానుల్లోనూ క్యూరియాసిటీ పెరిగింది. థియేట్రికల్ రన్ తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. విస్మయ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆషిష్ జో ఆంటోనీ కీలకమైన ప్రతినాయక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మోహన్‌లాల్ కూడా సినిమాలో ప్రత్యేకమైన, కీలకమైన పాత్రలో కనిపించడంతో ‘తుడక్కం’పై అంచనాలు మరింత పెరిగాయి.
థియేటర్లలో తనదైన ప్రభావాన్ని చూపించిన ‘తుడక్కం’ ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 18 నుంచి జియో హాట్ స్టార్‌లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. మలయాళంలో ఒరిజినల్ వెర్షన్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీంతో విస్మయ మోహన్‌లాల్ తొలి చిత్రం మలయాళ మార్కెట్‌ను దాటి పాన్ ఇండియా స్థాయిలో మరింత మంది ప్రేక్షకులకు చేరువ కానుంది. ‘తుడక్కం’ను దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించారు. సాధారణ యాక్షన్ సినిమాలకు భిన్నంగా.. సహజమైన పరిస్థితుల్లో జరిగే పోరాటాలు, సర్వైవల్ అంశాల చుట్టూ కథను నడిపించినట్లు తెలుస్తోంది.
ఒక మార్షల్ ఆర్టిస్ట్ ఎదుర్కొనే తీవ్రమైన పరిస్థితులు ఈ కథలో ప్రధానంగా ఉంటాయి. ఓ హింసాత్మక సిండికేట్ నుంచి ఇద్దరు చిన్నారులను కాపాడేందుకు ఆమె చేసే పోరాటమే సినిమా కథకు ప్రధాన ఆధారంగా నిలుస్తుంది. ఈ క్రమంలో కథానాయికకు ఎదురయ్యే సవాళ్లు, ప్రత్యర్థులతో జరిగే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ సినిమాకు కీలక ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. ‘తుడక్కం’లో విస్మయ మోహన్‌లాల్ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆమెకు ఉన్న ముయే థాయ్ ట్రైనింగ్‌ను సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లలో ఉపయోగించినట్లు సమాచారం. దీంతో సినిమాలోని ఫైటింగ్ సన్నివేశాలు కేవలం స్టంట్ల మాదిరిగా కాకుండా.. పాత్రకు సహజంగా సరిపోయేలా ఉండేలా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. బలమైన ఫిజికల్ యాక్షన్‌తో పాటు పాత్రలోని ఎమోషనల్ జర్నీకి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇద్దరు చిన్నారులను రక్షించేందుకు కథానాయిక చేసే పోరాటంలో ఎదురయ్యే అడ్డంకులు, ప్రత్యర్థుల నుంచి వచ్చే ప్రమాదాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.