Vishwak Sen | నా సినిమాను రాజకీయల్లోకి లాగకండి : విశ్వక్ సేన్
Laila Movie | 'లైలా' చిత్రం వివాదంకు సంబంధించి మరోసారి స్పందించాడు నటుడు విశ్వక్ సేన్.
Vishwak Sen | లైలా చిత్రంపై ఇంకా బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. నటుడు విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా వాలంటైన్స్ కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు పృథ్వీ మాట్లాడుతూ.. వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ సోషల్ మీడియా అభిమానులు అతడిని ట్రోల్ చేయడంతో పాటు లైలా సినిమాను బాయ్‌కాట్ చేస్తామని ఎక్స్‌లో ట్రెండ్ చేశారు. దీంతె దిగొచ్చిన చిత్రబృందం క్షమాపణలు తెలిపింది.
అయితే ఈ వివాదం ముగిసింది అనుకునేలోపు విశ్వక్ సేన్‌కి సంబంధించి ఒక పాత ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారడంతో అది వైసీపీ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేశాడని అందరూ మళ్లీ బాయ్‌కాట్ ట్రెండ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వివాదంపై స్పందించాడు విశ్వక్ సేన్.
నా సినిమాకి సంబంధించిన ప్రతి పోస్టర్ నా సినిమాకి సంబంధించినది మాత్రమే. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఫొటోలు చాలా పాతవి. అవి నెల కిందటా విడుదల చేసినవి. ఈ పోస్టర్లు సినిమాకు సంబంధించినవి మాత్రమే. ఈ ఫొటోల్లో ఉన్నది సోనూ మోడల్. ఫిబ్రవరి 14న మీ ముందుకు వస్తున్నాడు నేను ప్రతిసారీ తగ్గను. ప్రీరిలీజ్ ఈవెంట్లో జరిగిన దానికి ఇప్పటికే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాను. మళ్లీ చెబుతున్నా.. ఈ విషయంలో అతిగా ఆలోచించకండి.. నేను నటుడిని మాత్రమే నన్ను నా సినిమాని రాజకీయల్లోకి లాగకండి అంటూ విశ్వక్ రాసుకోచ్చాడు.
Na cinemaki samandhinchina prathi poster na cinema ki samandhinchindhi matrame this was #sonumodel first look poster released month ago . And the present red suit photo is also from past . Spread love . Maintain peace . I can’t keep thinking twice before every poster or post I… pic.twitter.com/WDNeeSi4xV
— VishwakSen (@VishwakSenActor) February 11, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

