నేను అడవికి వెళ్లి ఆడుకునే టైపు!

“పాగల్’ కథ వినగానే చాలా కొత్తగా అనిపించింది. అందుకే ఈ ప్రాజెక్ట్‌లో పాలుపంచుకున్నా. సినిమా ప్రచారాన్ని మొత్తం విశ్వక్సేన్ తీసుకున్నాడు. నిర్మాతగా అతన్ని చూసి నేను బాగా ఇంప్రెస్ అయ్యాను’ అన్నారు ప్రముఖ నిర్మాణ దిల్‌రాజు. ఆయన సమర్పణలో విశ్వక్సేన్ కథానాయకుడిగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పాగల్’. బెక్కెం వేణుగోపాల్ నిర్మాత. నివేదా పేతురాజ్, సిమ్రాన్‌చౌదరి కథానాయికలు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో విశ్వక్సేన్ మాట్లాడుతూ ‘ఎలాంటి లెక్కలు వేసుకోకుండా నిజాయితీగా ప్రేమించే ప్రేమ్ అనే యువకుడిగా నా పాత్ర సాగుతుంది. అతను తల్లి ప్రేమను అన్వేషిస్తూ చేసిన ప్రయాణమేమిటన్నదే ఈ సినిమా ఇతివృత్తం. ఈ సమయంలో థియేటర్లో సినిమా విడుదల చేయడం కరెక్టేనా అని చాలా మంది అడిగారు. నేను వాళ్లకు చెప్పేది ఒక్కటే.. సర్కస్‌లో సింహంతో ఎవరైనా ఆడుకుంటారు. కానీ నేను అడవికి వెళ్లి ఆడుకునే టైపు. మూసి ఉన్న థియేటర్లను కూడా ఈ సినిమాతో ఓపెన్ చేసి చూపిస్తా. తప్పైతే నా పేరు మార్చుకుంటా’ అన్నారు. దిల్‌రాజు ఇచ్చిన ధైర్యంతోనే రిస్క్ అని తెలిసినా సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తున్నామని, అందరూ గర్వపడే సినిమా చేశామని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తెలిపారు. విశ్వక్సేన్ కెరీర్లోనే పెద్ద హిట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉందని, దిల్‌రాజుగారి ఎంట్రీతో సినిమాకు మరింత హైప్ వచ్చిందని దర్శకుడు నరేష్ కుప్పిలి పేర్కొన్నారు. ఈ వేడుకలో యువహీరోలు కార్తికేయ, తేజ సజ్జా, శ్రీవిష్ణు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

