Vishwak Sen | ఇకపై మంచి సినిమాలు మాత్రమే చేస్తా.. తెలుగు సినిమా ప్రేక్షకులకు విశ్వక్సేన్ క్షమాపణలు
Vishwak Sen | నటుడు విశ్వక్ సేన్ తెలుగు సినిమా ప్రేక్షకులకు క్షమాపణలు తెలిపాడు.
Vishwak Sen | యువ కథానాయకుడు విశ్వక్ సేన్ తెలుగు సినిమా ప్రేక్షకులకు క్షమాపణలు తెలిపాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశాడు. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లైలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందే వివాదంలో చిక్కుకోవడం.. ఆ తర్వాత రిలీజ్ అయ్యాక అదే పాత రాడ్ కంటెంట్ అంటూ నెట్టింటా ట్రోల్ వచ్చాయి. దీంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్షమాపణలు తెలిపాడు. ఇకపై మంచి సినిమాలు మాత్రమే చేస్తానని తెలిపాడు.
నమస్తే, ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచినవారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే, కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఇక పై, నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే, అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే, నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది. ఎందుకంటే, నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు. నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇక పై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంతే కాకుండా, నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే, నా కథానాయకులు దర్శకులు, రచయితలు నా వెన్నెముకగా నిలిచి, నన్ను మలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరొక బలమైన కథతో ముందుకు వస్తాను. నా మంచి, చెడు కాలాల్లో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం ఇట్లు మీ విశ్వక్ సేన్ అంటూ రాసుకోచ్చాడు.
🙏 With gratitude #vishwaksen pic.twitter.com/c95Jyal2Il
— VishwakSen (@VishwakSenActor) February 20, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

