Virinchi Varma | ఏడేండ్ల తర్వాత ఉయ్యాల జంపాల డైరెక్టర్ కొత్త సినిమా
Virinchi Varma | ఉయ్యాల జంపాల (Uyyala Jampala ) సినిమాతో డైరెక్టర్‌గా సూపర్ ఎంట్రీ ఇచ్చాడు విరించి వర్మ (Virinchi Varma). ఆ తర్వాత నానితో కలిసి మజ్ను (2016) తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు విరించి వర్మ.
Virinchi Varma | ఉయ్యాల జంపాల (Uyyala Jampala ) సినిమాతో డైరెక్టర్‌గా సూపర్ ఎంట్రీ ఇచ్చాడు విరించి వర్మ (Virinchi Varma). విలేజ్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత నానితో కలిసి మజ్ను (2016) తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు విరించి వర్మ. సుమారు ఏడేండ్ల విరామం తర్వాత మళ్లీ కొత్త మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చేశాడు విరించి వర్మ.
ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ ప్రాజెక్ట్ షూటింగ్‌ను మొదలుపెట్టేశాడు విరించి వర్మ. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ కొనసాగుతోంది. తెలంగాణలో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని తాజా సమాచారం. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ లీడ్ రోల్లో నటించబోతున్నట్టు వార్తలు రాగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ముడుగంటి క్రియేషన్స్ డెబ్యూ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి పాపులర్ మలయాళ కంపోజర్ గోపీ సుందర్ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమా కోసం పనిచేయబోయే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

