‘టీజర్, పాటలు కొత్తగా ఉన్నాయి. యువతరాన్ని ఈ సినిమా మెప్పిస్తుందనే నమ్మకముంది’ అని అన్నారు శేఖర్‌కమ్ముల. ఆదివారం హైదరాబాద్‌లో ‘వర్జీన్ స్టోరీ’ టీజర్‌ను ఆయన విడుదలచేశారు. విక్రమ్, సౌమిక జంటగా నటిస్తున్నారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగపాటి శిరీష, శ్రీధర్ నిర్మిస్తున్నారు. ప్రదీప్ బీ అట్లూరి దర్శకుడు. ‘కొత్తగా రెక్కలొచ్చేనా’ ఉపశీర్షిక. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘లగడపాటి శ్రీధర్ చేసిన సినిమాలంటే నాకు ఇష్టం. మంచి సినిమాలు ఎవరు చేసినా ప్రోత్సహిస్తుంటారాయన. తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అనితెలిపారు. ‘టీనేజ్ మనస్తత్వాలను ప్రతిబింబిస్తూ సాగే కథ ఇది. నిజమైన ప్రేమ కోసం అన్వేషిస్తూ ఓ జంట సాగించే ప్రయాణానికి దృశ్యరూపంగా ఉంటుంది. త్వరలో థియేటర్స్‌లో విడుదలచేస్తాం’ అని లగడపాటి శ్రీధర్ పేర్కొన్నారు. తన జీవితంలో జరిగిన వాస్తవ ఘటనల నుంచి స్ఫూర్తి పొందుతూ ఈ సినిమాను తెరకెక్కించానని దర్శకుడు చెప్పారు.