టాలీవుడ్ లో ఇప్పటివరకు మెగా ఫ్యామలీ నుంచే ఎక్కువమంది వచ్చారు. ఇప్పుడు అల్లు ఫ్యామిలీ నుంచి కూడా కొత్త హీరోలు వస్తున్నారు. అలా తెలుగుతెరకు హీరోగా పరిచయం అవుతున్నాడు విరాన్ ముత్తం శెట్టి. ఈ మధ్యనే అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగాఈ కుర్రహీరో తన మొదటి సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు. బతుకు బస్టాండ్ పేరుతో వస్తోన్న ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫుల్ మాస్ సినిమాగా ఇది తెరకెక్కుతోందని గ్లింప్స్ చూడగానే అర్థమవుతోంది. ఐవీ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతోన్న ఈసినిమాకి శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేస్తున్నారు. యెలేందర్ మహావీర్ సంగీతం అందిస్తున్నాడు.నికిత అరోరా, శృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తోన్న ఈసినిమాని కవిత, మాధవి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ 11న బతుకు బస్టాండ్ సినిమా విడుదల కాబోతోంది.