Joruga Husharuga | డిసెంబర్లో రాబోతున్న బేబీ హీరో.. ‘జోరుగా హుషారుగా’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
Joruga Husharuga | 'మానసనమా', 'బేబి' చిత్రాలతో నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న యూత్‌ఫుల్ కథానాయకుడు విరాజ్ అశ్విన్ (Viraj Ashwin). ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ (Poojitha Ponnada) కథానాయికగా నటిస్తుంది.
Joruga Husharuga | ‘మానసనమా’, ‘బేబి’ చిత్రాలతో నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న యూత్‌ఫుల్ కథానాయకుడు విరాజ్ అశ్విన్ (Viraj Ashwin). ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ (Poojitha Ponnada) కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకు అను ప్రసాద్ (Anu Prasad) దర్శకత్వం వహిస్తుండగా.. శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత నిరీష్ తిరువిధుల. ఇందుకు సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ చిత్ర విశేషాలను తెలియజేశాడు. యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు, పాటలకు మంచి స్పందన వచ్చింది.. సినిమాలో అందర్ని ఆకట్టుకునే వినోదం కూడా వుంది. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఓ మంచి సినిమా చూశామనే అనుభూతికి లోనవుతారు. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారి సహకారంతో చిత్రాన్ని డిసెంబరు 15న విడుదల చేస్తున్నాం అని నిరీష్ తిరువిధుల అన్నారు.
దర్శకుడు అను ప్రసాద్ మాట్లాడుతూ ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్‌ను కొత్తగా చూస్తారు. ఆయన పాత్రలో మంచి ఎనర్జీ వుంటుంది. బేబి చిత్రంతో యూత్‌కు దగ్గరైన విరాజ్ ఈ చిత్రంతో వారికి మరింత చేరువతాడు. కొత్తదనం ఆశించే ప్రతి ఒక్కరికి మా చిత్రం తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది అని తెలిపారు.
ఈ సినిమాలో విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడలతో పాటు.. సాయికుమార్, రోహిణి, మధునందన్, సిరి హనుమంతు, సోనూ ఠాకూర్, బ్రహ్మజీ , చమ్మక్ చంద్ర, క్రేజీ కన్నా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రణీత్ మ్యూజిక్, ఎడిటర్: మర్తండ్ కే వెంకటేష్, ప్రొడక్షన్ కంట్రోలర్: తేజ తిరువిధుల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

