Joruga Husharuga | ‘జోరుగా హుషారుగా’ అంటూ వస్తున్న ‘బేబి’ హీరో విరాజ్ అశ్విన్.. ట్రైలర్ చూశారా.!
Joruga Husharuga | ‘మానసనమా’, ‘బేబి’ చిత్రాలతో నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న టాలీవుడ్ యూత్‌ఫుల్ కథానాయకుడు విరాజ్ అశ్విన్ (Viraj Ashwin). ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ (Poojitha Ponnada) కథానాయికగా నటిస్తుంది.
Joruga Husharuga | ‘మానసనమా’, ‘బేబి’ చిత్రాలతో నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న టాలీవుడ్ యూత్‌ఫుల్ కథానాయకుడు విరాజ్ అశ్విన్ (Viraj Ashwin). ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ (Poojitha Ponnada) కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకు అను ప్రసాద్ (Anu Prasad) దర్శకత్వం వహిస్తుండగా.. శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 15న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్లతో టీజర్ విడువల చేయగా.. ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఉప్పెన ఫేం దర్శకుడు బుచ్చిబాబు సనా విడుదల చేసి.. చిత్రబృందనిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తే ఆద్యంతం ఫన్ రైడ్‌లా కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్‌తో ఆకట్టుకుంటుంది. బ్రహ్మజీ కామెడీ డైలాగ్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి.
ఈ సినిమాలో విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడలతో పాటు.. సాయికుమార్, రోహిణి, మధునందన్, సిరి హనుమంతు, సోనూ ఠాకూర్, బ్రహ్మజీ , చమ్మక్ చంద్ర, క్రేజీ కన్నా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రణీత్ మ్యూజిక్, ఎడిటర్: మర్తండ్ కే వెంకటేష్, ప్రొడక్షన్ కంట్రోలర్: తేజ తిరువిధుల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

