Vikranth Rona Movie | మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ‘విక్రాంత్ రోణ’..!
Vikranth Rona Collections | కన్నడ స్టార్ హీరో సుదీప్ కిచ్చా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రాంత్ రోణ’. అనూప్ భందారి దర్శకత్వం వహించాడు. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 28న విడుదలై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజే దాదాపు రూ.27 కోట్లు కలెక్ట్ చేసి సుదీప్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల మంచి కలెక్షన్లను రాబడుతూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ వచ్చిన టాప్-5 సౌత్ సినిమాలలో విక్రాంత్ రోణ నిలిచింది. తాజాగా ఈ చిత్రం తెలుగులో బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుంది.
విక్రాంత్ రోణ చిత్రానికి తెలుగులో కోటిన్నర వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మూడు రోజులు పూర్తయ్యే సరికి ఈ చిత్రం రూ.1.91 కోట్ల షేర్‌ను సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. పోటీగా తెలుగు స్ట్రైయిట్ సినిమా ఉన్నా ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుందంటే విశేషం అనే చెప్పాలి. ఇలానే కంటిన్యూ అయితే ఈ చిత్రం ఫైనల్‌గా పది కోట్ల వరకు షేర్‌ను సాధిస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఈ చిత్రాన్ని షాలిని ఆర్ట్స్, ఇన్వేనియో ఫిలింస్ ఇండియా సంస్థలతో కలిసి సుదీప్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. బాలీవుడ్ భామ జాక్వెలీన్ ఫెర్నాండెజ్ కీలకపాత్రలో నటించింది. ఇక ఈ ఏడాది కన్నడ నుండి వచ్చిన ‘జేమ్స్’, ‘కేజీఎఫ్-2’, ‘చార్లీ777’ సినిమాలు కూడా టాలీవుడ్లో మంచి విజయాలు సాధించాయి. కంటెంట్ ఉంటే డబ్బింగ్ సినిమాలు కూడా స్ట్రైయిట్ తెలుగు సినిమాలకంటే ఎక్కువ కలెక్షన్లు రాబడతాయని ఈ సినిమాలు నిరూపించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

