Spark | విక్రాంత్ (Vikrant) హీరోగా నటిస్తోన్న చిత్రం స్పార్క్ (Spark). అరవింద్ కుమార్ రవివర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రుక్సార్ ధిల్లాన్, మెహరీన్ కౌర్ ఫిర్జాదా (Mehreen Pirzada) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఏమా అందం (YemaAndham) సాంగ్‌ను లాంఛ్ చేశారని తెలిసిందే. విక్రాంత్, రుక్సాన్ ధిల్లాన్ కాంబినేషన్లో వచ్చే ఈ బ్యూటీఫుల్ ట్రాక్‌ను అనంత్ శ్రీరామ్ రాయగా.. సింగిల్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ పాడాడు.
ఈ పాట నెట్టింట వ్యూస్ పంట పండిస్తోంది. కాగా ఇప్పుడు స్పార్క్ నుంచి రెండో సాంగ్ అప్డేట్ అందించారు. ఇది ఇది మాయా సాంగ్ idhi idhiMaya songను అక్టోబర్ 4న గ్రాండ్‌గా లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ పాటను కూడా అనంత్ శ్రీరామ్ రాసినట్టే వీడియో ద్వారా క్లారిటీ వచ్చేశాడు డైరెక్టర్.మలయాళ కంపోజర్ హేశమ్ అబ్ధుల్ వహబ్ కంపోజిషన్‌లో మరో అద్భుతమైన పాట రాబోతున్నట్టు తాజా వీడియోతో క్లారిటీ వచ్చేస్తుంది. ఇది ఇది మాయా సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఖుషి చిత్రానికి సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన హేశమ్ అబ్ధుల్ వహబ్ అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేసినట్టు తాజా ట్యూన్‌తో క్లారిటీ వచ్చేస్తుంది.
యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న స్పార్క్‌లో నాజర్, వెన్నెల కిశోర్, షాయాజీ షిండే, సుహాసినీ మణిరత్నం, శ్రీకాంత్, కిరణ్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్పార్క్‌లో గురు సోమసుందరం విలన్‌గా నటిస్తున్నాడు. స్పార్క్ చిత్రానికి డైరెక్టర్ అరవింద్ కుమార్ రవివర్మ సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేస్తుండటం విశేషం. స్పార్క్ డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది.
ఇది ఇది మాయా సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో..
After getting blockbuster response for 1st single #YemaAndham, #SPARKTheLife 2nd single announcement is here! 🤩
– https://t.co/uTAp7mpKJE #IdhiIdhiMaya song will be out on Oct 4th! ❤️
A @HeshamAWMusic Musical 🎵 @ThisIsVikranth @RuksharDhillon #AnanthSriram @adityamusic pic.twitter.com/ZzeCPHZlkK
— BA Raju’s Team (@baraju_SuperHit) October 2, 2023
ఏమా అందం సాంగ్..