అనూప్ భందారి దర్శకత్వంలో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం విక్రాంత్ రోన (Vikrant Rona). శాండల్ వుడ్ స్టార్ హీరో సుదీప్ కిచ్చా (Kichcha Sudeep) టైటిల్ రోల్ పోషించగా..బాలీవుడ్ వ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. కలెక్షన్లు నెమ్మదిగా మొదలై..బాక్సాపీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది విక్రాంత్ రోన.
ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. విక్రాంత్ రోన అన్ని భాషల్లో రూ.100 కోట్లు గ్రాస్ మార్కు దాటిందని ట్రేడ్ సర్కిల్ టాక్. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టినట్టు ఇన్ సైడ్ టాక్. రానున్న రోజుల్లో సెకండ్ పార్టు కూడా ప్రకటించబోతున్నట్టు సమాచారం. సుదీప్ ఈ చిత్రంలో పోలీసాఫీసర్ గా నటించాడు.
కన్నడతోపాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రానికి బాక్సాపీస్ వద్ద మంచి టాక్ వచ్చింది. షాలిని ఆర్ట్స్, ఇన్వేనియో ఫిలింస్ ఇండియా సంస్థల భాగస్వామ్యంతో సుదీప్ ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.