Thangalaan | ప్లాన్‌ను మించి పెరిగిపోయిన తంగలాన్ బడ్జెట్.. విక్రమ్ సినిమాపై నిర్మాత ఏమన్నారంటే..?
Thangalaan | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి తంగలాన్ (Thangalaan). ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా పాపులర్ నిర్మాత ధనంజయన్ (Dhananjayan) తంగలాన్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి అందించారు.
Thangalaan | అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించే పనిలో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి తంగలాన్ (Thangalaan). తమిళ్ అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా పాపులర్ నిర్మాత ధనంజయన్ (Dhananjayan) తంగలాన్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి అందించారు.
సినిమా బడ్జెట్ మేం అనుకున్న దానికంటే మించిపోయింది. ఈ సినిమా బడ్జెట్ ముందుగా వేసుకున్న అంచనాను దాటి ఇప్పుడు అది 100కోట్లకుపైగా చేరిపోయింది.తంగలాన్ కోసం రక్తం చిందించేలా ఎంత కష్టపడ్డామో సినిమాలో చూస్తారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు దిశగా ప్లాన్ చేస్తున్నాం. స్టూడియో గ్రీన్ బ్యానర్‌కు ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెడుతుందని ధీమా వ్యక్తం చేశారు ధనంజయన్.
పా రంజిత్ టీం ఈ చిత్రాన్ని 2024 ప్రథమార్థంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విక్రమ్ ఫ్యాన్స్ కోసం కొన్ని రోజుల క్రితం మేకర్స్ విడుదల చేసిన తంగలాన్ గ్లింప్స్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ చిత్రం 2డీ, 3డీ ఫార్మాట్లలో కూడా విడుదల కానుంది. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
విక్రమ్ దీంతోపాటు గౌతమ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon) డైరెక్షన్లో ధ్రువ నక్షత్రం.. చాప్టర్ వన్: యుద్ద కాండం (Dhruva Natchathiram) లో కూడా నటిస్తున్నాడు. ఈ స్పై థ్రిల్లర్ జోనర్ ప్రాజెక్ట్‌లో ఐశ్వర్యారాజేశ్, సిమ్రాన్, రాధికా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తంగలాన్ మేకింగ్ గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

