Thangalaan | అగ్ర హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ పతాకాలపై కేఈ జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు. బుధవారం విక్రమ్ జన్మదినం సందర్భంగా స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో విక్రమ్ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘చరిత్రలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.
వ్యవస్థలోని ఆధిపత్య శక్తులపై ఓ సామాన్యుడు వినిపించే ధిక్కార స్వరం ఇది. విక్రమ్ పాత్ర చిత్రణ భిన్న కోణాల్లో సాగుతుంది. గ్లోబల్ ఆడియెన్స్‌కు రీచ్ అయ్యే సాహసోపేతమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’ అని చెప్పారు. మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్భుదురై తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, దర్శకత్వం: పా.రంజిత్.