Vikram Movie | కమల్‌హాసన్ ‘విక్రమ్’ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడేనట?
Vikram Movie | లోకనాయకుడు కమల్‌హాసన్ ఆరు పదుల వయసు దాటినా యువ హీరోలకు ధీటుగా యాక్షన్ సినిమాలను చేస్తున్నాడు. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. మాస్టర్ ఫేం లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. గతేడాది విడుదలైన టైటిల్ టీజర్ నుంచి ఇటీవలే విడుదలైన మేకింగ్ గ్లింప్స్ వరకు ప్రతి ఒక్కటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గతకొంత కాలంగా కమల్ నుంచి ఆశించిన స్థాయిలో ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ క్రమంలో ‘విక్రమ్’ చిత్రం మళ్ళీ అప్పటి కమల్‌ను గుర్తుచేస్తుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం తరచూ ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ మే 11న విడుదల కానుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ పాటను కమల్ పాడటమే కాకుండా సాహిత్యాన్ని కూడా అందించాడు. ఈ చిత్రంపై ప్రేక్షకులలో మొదటి నుంచి భారీ స్థాయిలో అంచనాలను నెలకొన్నాయి. ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలు ఈ చిత్రంలో నటించనుడంటంతో ప్రేక్షకులలోనే కాదు సినీప్రముఖులలో కూడా అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇటీవలే ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు రూ.125కోట్లకు అమ్ముడయ్యాయి. కమల్ హసన్‌కు 232 సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలింస్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ హాసన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

