Vikram Movie | ఏడాది పూర్తి చేసుకున్న విక్రమ్ సినిమా.. నిర్మాతలకు కోట్ల లాభాలు తెచ్చిపెట్టిందిగా..!
One Year Of Vikram Movie | సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున తమిళంలో ఓ సంచలనం జరిగింది. ఆ సంచలనం పేరు విక్రమ్. లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ఈ సినిమా ఏడాది క్రితం విడుదలై బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. రోబో 2.o తర్వాత ఐదేళ్లకు ఈ సినిమా తమిళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
One Year Of Vikram Movie | సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున తమిళంలో ఓ సంచలనం జరిగింది. ఆ సంచలనం పేరు విక్రమ్. లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ఈ సినిమా ఏడాది క్రితం విడుదలై బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. రోబో 2.o తర్వాత ఐదేళ్లకు ఈ సినిమా తమిళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఒక్క తమిళంలోనే కాదు విడుదలైన అన్ని భాషల్లోనూ కోట్లు కొల్లగొట్టింది. లోకేష్ కనగరాజ్ టేకింగ్, నటీనటులు ఫర్ ఫార్మెన్స్ కు ప్రేక్షకులు వెర్రెత్తి పోయారు. వందేళ్ళ కోలీవుడ్ సినిమా చరిత్రలో అత్యధిక మంది వీక్షించిన తమిళ సినిమాగా విక్రమ్ మూవీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. సూర్య రోలెక్స్ పాత్రలో 5 నిమిషాలు మెరిసాడు. సూర్య పాత్ర సినిమాకే హైలేట్ అని చెప్పవచ్చు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. శనివారంతో ఈ సినిమా ఏడాది పూర్తి చేసుకుంది. ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూళ్ చేసిందో చూద్దాం.
తమిళనాడు : 93 కోట్లు
తెలంగాణ+ఏపి : 18 కోట్లు
కేరళ : 17 కోట్లు
కర్ణాటక : 12 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 8 కోట్లు
ఓవర్సీస్ : 59 కోట్లు
ఫైనల్ రన్ లో విక్రమ్ సినిమా రూ.207 కోట్లు( రూ.426 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూటర్ లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. పదేళ్లకు పైగా హిట్ వాసనే చూడని కమల్ కు విక్రమ్ ఇచ్చిన బూస్టప్ అంతా ఇంతా కాదు. ఇక ప్రస్తుతం కమల్ ఇండియన్-2 తో బిజీగా ఉండగా.. లోకేస్ కనగరాజ్ లియో సినిమాతో బిజీగా ఉన్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

