తమిళ అగ్రనటుడు, ఇళయ దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే, ఆయన తాజా సినిమా ‘జన నాయగన్’ విడుదలకు అన్ని ఆటంకాలు తొలిగిపోయినట్టయింది. ఇక ఆ సినిమా విడుదల కోసం విజయ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తున్నది.
జూన్ 22న విజయ్ పుట్టినరోజు. కాబట్టి, జూన్ 19న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ నిశ్చయించారట. ఇప్పటికే కొన్ని ఆన్లైన్ బుకింగ్ యాప్స్‌లో డేట్ వచ్చేసింది. ప్రస్తుతం అధికారిక ప్రకటన కోసం అంతా ఎదురుచూస్తున్నారు. తెలుగులో బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందినట్టు వినికిడి. మమితా బైజు కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. హెచ్ వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ పానిండియా చిత్రం తెరకెక్కింది.