Liger Movie | క్యాచీగా ‘లైగర్’ రొమాంటిక్ సాంగ్.. ఆకట్టుకుంటున్న విజయ్, అనన్య సిగ్నేచర్ స్టెప్స్
Liger Movie Aafat Song | రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుండి సినిమా వచ్చి రెండేళ్ళు దాటింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఈయన నటించిన ‘లైగర్’ కోసం అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఒక్క ట్రైలర్‌తోనే లైగర్ చిత్రంపై విపరీతమైన బజ్ ఏర్పడింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఈక్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రంలోని రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేశారు.
‘ఆఫట్’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. విజయ్, అనన్య డ్యాన్స్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. భాస్కరభట్ల రచించిన ఈ పాటను సింహా, శ్రావణ భార్గవి ఆలపించారు. తనిష్క్ బగ్చీ ట్యూన్ క్యాచీగా ఉంది. నిజానికి ఈ పాట శుక్రవారం సాయంత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ టెక్నికల్ గ్లిట్చ్ కారణంతో తాజాగా విడుదలైంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ఆక్డీ పక్డీ సాంగ్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
ఈ చిత్రాన్ని కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ముంబైలోని ఓ చాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

