Family Star | టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay devarakonda), మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). ఈ సినిమాకు గీతా గొవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించగా.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 05న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
అయితే విడుదలకు ముందు ఈ సినిమా ప్రమోషన్స్‌ను దిల్ రాజ్ నిర్వహించగా.. ఈ వేడుకలో ఒక అభిమాని మాట్లాడుతూ.. మా చెల్లి కూడా రియల్ ‘ఫ్యామిలీ స్టార్’ అని తెలిపాడు. తాను దివ్యాంగురాలైనా ఉద్యోగం చేస్తూ మా కుటుంబం మొత్తాన్ని చూసుకునేది. అని తెలిపాడు. దీంతో ఈ మాటలు విన్న దిల్ రాజ్ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం తప్పకుండా మీ సిస్టర్ను కలుస్తామని చెప్పాడు. అయితే చెప్పినట్లుగానే ఆ అభిమాని ఇంటికి ఫ్యామిలీ స్టార్ టీమ్ వెళ్లి సందడి చేసింది. విజయ్ దేవరకొండ, దిల్‌రాజు, పరశురామ్ ఆమెతో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
#VijayDevaraKonda and #DilRaju good gesture to meet one of #FamilyStar
👏👏 Heart Touching, inspiring Story, #TheFamilyStar pic.twitter.com/8JPXNbH1Jr
— Telugu Bit (@telugubit) April 8, 2024