Vijayakanth: కుదుట పడ్డ విజయకాంత్ ఆరోగ్యం.. నర్సులతో కాలక్షేపం

కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి అనేక పుకార్లు వస్తుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.రీసెంట్గా విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని, అత్యవసర చికిత్స కోసం ఆయన చెన్నై నుంచి దుబాయ్ వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. అవసరమైతే అట్నుంచి అటు ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేసి పెట్టారని అన్నారు.
తాజాగా విజయకాంత్ తన ఆరోగ్యంపై స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని డీఎండీకే అధినేత విజయకాంత్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తాను నటించిన క్షత్రియన్ను ఆస్పత్రి నర్సు లతో కలిసి చూస్తూ.. కాలక్షేపం చేస్తున్న ఫొటోను విడుదల చేశారు. దీంతో డీఎండీకే వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి.
గతేడాది కరోనా బారిన పడ్డారు విజయకాంత్. వైరస్ సోకి ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆ టైమ్ లో కూడా ఆయన హెల్త్ కండిషన్ పై పార్టీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. హాస్పిటల్ లో జాయిన్ అయిన 2 రోజులకు కరోనా అనే విషయాన్ని ప్రకటించారు. తాజాగా విజయ్ కాంత్ తన హెల్త్ అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సైడ్ ఎఫెక్టుల వల్ల విజయ్ కాంత్ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నట్టు కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Health
- Nurses
- Vijaykanth
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

