Vijayakanth | ముగిసిన విజయ్‌కాంత్ అంత్యక్రియలు
Vijayakanth | కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్‌కాంత్ (VijayKaanth) అంత్యక్రియలు (Funeral Rites) ముగిశాయి. తమిళనాడు కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో విజయ్‌కాంత్ కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి.
Vijayakanth Funeral Rites | కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్‌కాంత్ (Vijayakanth) అంత్యక్రియలు (Funeral Rights) ముగిశాయి. తమిళనాడు కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో విజయ్‌కాంత్ కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి.
అంతకుముందు పార్టీ కార్యాలయంలో ఉంచిన విజయకాంత్ పార్థివదేహాన్ని చెన్నైలోని తీవు తిడల్‌కు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం తీవు తిడల్ నుంచి డీఎండీకే పార్టీ కార్యాలయంకు తరలించి పార్టీ కార్యాలయ ఆవరణలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఇక కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొని విజయకాంత్‌కు కడసారి వీడ్కోలు పలికారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్ గురువారం(డిసెంబర్ 28) కన్నుమూసిన విషయం తెలిసిందే. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని మియోట్ దవాఖానలో చేరగా.. కొవిడ్ నిర్ధారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా.. విజయకాంత్ తుదిశ్వాస విడిచారు. నటుడిగా, రాజకీయవేత్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న విజయ్ కాంత్ మృతి పట్ల యావత్ తమిళ ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

