Vijay | ‘కార్తికేయ 2’ చూసిన కోలీవుడ్ స్టార్ హీరో..రివ్యూ కోసం వెయిటింగ్..!
చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్షన్లో మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది కార్తికేయ 2 (Karthikeya 2). నార్తిండియాలో కూడా కార్తికేయ 2 థియేటర్లను పెంచాలని విజ్ఞప్తులు వస్తున్నాయంటే సినిమా ప్రేక్షకులకు ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటించిన చిత్రం కార్తికేయ 2 (Karthikeya 2). చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్షన్లో మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఆగస్టు 13న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి మంచి ప్రశంసలు అందుతున్నాయి. నార్తిండియాలో కూడా కార్తికేయ 2 థియేటర్లను పెంచాలని విజ్ఞప్తులు వస్తున్నాయంటే సినిమా ప్రేక్షకులకు ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
సూపర్ హిట్ మూవీని కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) చూశాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. వారసుడు సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నాడు విజయ్. తాజా అప్ డేట్ ప్రకారం హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో సోమవారం రాత్రి కార్తికేయ 2ను చూసినట్టు ఇన్ సైడ్ టాక్. ఈ న్యూస్ తెలుసుకున్న మూవీ లవర్స్ మరి కార్తికేయ 2పై ఎలాంటి రివ్యూ ఇస్తాడోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీపైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో వస్తున్న సినిమా వారసుడు. తమిళంలో వారిసు..ది బాస్ రిటర్న్స్ టైటిల్‌తో వస్తోంది. విజయ్ (Vijay 66th) 66వ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్నఈ మూవీలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- amb cinemas
- karthikeya 2
- vijay
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

