Vijay- Trisha | తమిళ సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు విజయ్, త్రిష. వీరిద్దరి మధ్య స్నేహానికి మించి ప్రత్యేకమైన అనుబంధం ఉందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అయితే ఇంతకాలం కేవలం రూమర్స్‌కే పరిమితమైన ఈ వార్తలు తాజాగా మరోసారి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. గత కొన్ని నెలలుగా విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన కుటుంబ జీవితానికి సంబంధించి వచ్చిన వార్తల తర్వాత త్రిష, విజయ్ కలిసి పలుమార్లు కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. వివిధ కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి కనిపించడం, విజయ్ కుటుంబ సభ్యులతో త్రిష సన్నిహితంగా ఉండడం, వ్యక్తిగత వేడుకల్లో పాల్గొనడం వంటి అంశాలు వీరి రిలేషన్‌పై మరింత చర్చకు దారితీశాయి.
అయితే విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేయకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో విజయ్ను అన్‌ఫాలో చేశారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందా? ఇప్పటికే విడిపోయారా? అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. అయితే ఆ రూమర్లన్నింటికీ త్రిష ఒక్క ఫోటోతోనే సమాధానం ఇచ్చినట్టైంది. విజయ్ పుట్టినరోజు వేడుక సందర్భంగా అర్ధరాత్రి నిర్వహించిన సెలబ్రేషన్‌కు సంబంధించిన ప్రత్యేక ఫోటోను త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ఆ ఫోటోలో విజయ్, త్రిష ఇద్దరూ కేక్ ముందు కనిపించారు.
ఆ ఫోటోకు త్రిష ఎంతో భావోద్వేగంగా క్యాప్షన్ కూడా ఇచ్చింది. అన్నింటినీ విలువైనవిగా మార్చే వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే అంటూ ఆమె పోస్ట్ చేయడం అభిమానులను ఆకట్టుకుంది. అలాగే “00:00” అనే టైమ్‌ను ప్రస్తావించడం ద్వారా ఈ సెలబ్రేషన్ అర్ధరాత్రి జరిగినదని ఆమె సూచించింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్, త్రిష మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడిందనే అభిప్రాయాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వీరిద్దరి సంబంధంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, తరచూ వెలుగులోకి వస్తున్న ఈ తరహా సంఘటనలు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.