Vijay Thalapathy | యాభై ఏళ్ళ గ్యాంగ్‌స్టర్ పాత్రలో విజయ్ దళపతి?
Vijay Thalapathy Next Movie | ఇండస్ట్రీలో ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయితే మళ్ళీ ఆ హీరో, దర్శకుడు కలిసి సినిమా చేయాలని ఆసక్తి చూపుతుంటారు. ప్రేక్షకులలో కూడా మళ్ళీ వీళ్ళ కాంబోలో సినిమా వస్తే బావుంటుందని అభిప్రాయ పడుతుంటారు. ఒకవేళ అన్ని కుదిరి ఆ కాంబోలో సినిమా సెట్టయితే మాత్రం ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడుతుంటాయి. అలాంటి కాంబినేషన్లో విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబో ఒకటి. వీళ్ళ కాంబోలో సినిమా తెరకెక్కుతుందంటే ప్రేక్షకులే కాదు. సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘మాస్టర్’ మంచి విజయం సాధించింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టి విజయ్ మార్కెట్‌ను అమాంతం పెంచింది.
కాగా వీళ్ళ కాంబోలో తెరకెక్కుతున్న #Thalapathy67 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పైగా లోకేష్ ‘విక్రమ్’ సినిమాలో కమల్‌కు కెరీర్ బెస్ట్ లుక్స్, క్యారెక్టరైజేషన్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు విజయ్ను ఏ రేంజ్లో చూపిస్తాడో అని ఆసక్తితో ఎదరు చూస్తున్నారు. కాగా ఇటీవలే లోకేష్ కనగరాజ్ .. విజయ్‌తో చేయబోయేది గ్యాంగ్ స్టర్ సినిమా అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో విజయ్ 50ఏళ్ళ వయసున్న గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడట. విజయ్ గెటప్కూడా ఊర మాస్‌గా ఉంటుందంట. ఇప్పటికే లోకేష్ విజయ్ గెటప్‌కు సంబంధించిన స్కెచెస్‌ను కూడా డిజైన్ చేశాడట. ప్రస్తుతం ‘విక్రమ్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నలోకేష్ త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి దృష్టి పెట్టనున్నాడట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

