Vijay Thalapathy | ఆ టాలీవుడ్ దర్శకుడిని విజయ్ దళపతి అందుకే పక్కన పెట్టాడా?
Vijay Thalapathy 68 | ఈ మధ్య తెలుగులో విజయ్ దలపతి మార్కెట్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఆయన సినిమా వస్తుందంటే టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు సైతం ఎగబడి మరీ డబ్బింగ్ హక్కులు కొనుక్కుంటున్నారు.
Vijay Thalapathy 68 | ఈ మధ్య తెలుగులో విజయ్ దళపతి మార్కెట్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఆయన సినిమా వస్తుందంటే టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు సైతం ఎగబడి మరీ డబ్బింగ్ హక్కులు కొనుక్కుంటున్నారు. సీరియల్ అని టాక్ వచ్చిన వారసుడు సైతం తెలుగులో కమర్షియల్‌గా సేఫ్ అయింది. ఇక దసరాకు రానున్న లియో హక్కులు ఏకంగా రూ.22 కోట్లకు పలికాయంటే ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక లియో తర్వాత విజయ్ గోపిచంద్ మలినేనితో సినిమా చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది.
తమిళ మీడియాలు సైతం గోపిచంద్ మలినేని కథకు విజయ్ ఇంప్రెస్ అయ్యాడు అని రాసుకొచ్చాయి. అయితే అనూహ్యంగా కస్టడీ డైరెక్టర్ వెంకట్ ప్రభు లైన్లోకి వచ్చాడు. అయితే ఇందులో ఓ తిరకాసు ఉన్నట్లు తెలుస్తుంది. నిజానికి విజయ్.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయాలనే అనుకున్నాడట. అయితే విజయ్ రెండేళ్లలో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడట. ఈ క్రమంలో తమిళనాడు పాలిటిక్స్ నేపథ్యలో ఈ సినిమా చేయాలని భావించి.. వెంకట్ ప్రభును లైన్లో దింపాడట. పొలిటికల్ జానర్ సినిమాలు చేయడంలో వెంకట్ ప్రభు సిద్దహస్తుడు. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాను వెంకట్ ప్రభుకు అప్పగించాడట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం విజయ్ నటిస్తున్న లియో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ సినిమాపై తిరుగులేని అంచనాలు క్రియేట్ చేసింది. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.లలిత్ కుమార్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

