Train Movie | మరో థ్రిల్లర్ తో వస్తున్న విజయ్ సేతుపతి.. ఇంట్రెస్టింగ్ స్టిల్‌తో ఫస్ట్ లుక్ అప్డేట్
Train Movie | ఓ వైపు హీరోగా.. మరోవైపు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తూ.. సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఇటీవలే జవాన్‌లో విలన్‌గా స్టన్నింగ్ యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. అయితే విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా చిత్రం ‘ట్రైన్’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ (Myskin) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Train Movie | ఓ వైపు హీరోగా.. మరోవైపు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తూ.. సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఇటీవలే జవాన్‌లో విలన్‌గా స్టన్నింగ్ యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. అయితే విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా చిత్రం ‘ట్రైన్’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ (Myskin) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ సనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలో మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా నుంచి చిత్రబృందం ఫస్ట్‌లుక్ పోస్టర్ని విడుదల చేస్తూ షూటింగ్‌ను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ట్రైన్ పట్టాలు, విజయ్ కనిపిస్తుండగా.. విజయ్ రస్టిక్లుక్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తుంది. గణేష్ వెంకట్రామన్, నాజర్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
. @DirectorMysskin ‘s #Train first look.@theVcreations @fowziafathima @RIAZtheboss @teamaimpr pic.twitter.com/RLmygVvuRI
— VijaySethupathi (@VijaySethuOffl) November 30, 2023
మరోవైపు విజయ్‌సేతుపతి 51 (VJS51) కూడా చేస్తున్నాడు. ఈ మూవీ ఇప్పటికే మలేషియాలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. అరుముగ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 7Cs Entertaintment బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రొడక్షన్ నంబర్ 5గా వస్తోన్న ఈ మూవీలో రుక్మిణి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా..యోగిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. విజయ్ సేతుపతి దీంతోపాటు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మేరీ క్రిస్మస్లో నటిస్తుండగా.. కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

