Vijay Sethupathi | ఆ స్టార్ హీరో సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి?
Vijay Sethupathi | ఒక వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపును సంపాదించికున్న నటుడు విజయ్ సేతుపతి. పాత్ర నచ్చితే చిన్న సినిమాల్లో కూడా నటించడానికి సిద్దంగా ఉండే అతికొద్ది మంది నటులలో ఈయన ఒకడు. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ‘ఉప్పెన’లో ఈయన పండించిన విలనిజంకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ‘మాస్టర్’లో కూడా ఈయన విలనిజంకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలో విజయ్ సేతుపతి ముచ్చటగా మూడో సారి విలన్ పాత్రలో నటించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం.
నయనతార బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ శివన్, అజిత్‌తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించడానికి మేకర్స్ విజయ్ను సంప్రదించారట. పాత్ర నచ్చడంతో విజయ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘కణ్మణి రాంబో ఖతిజా’ తాజాగా విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ‘విక్రమ్’ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

