విజయ్ సేతుపతి తమిళ్ వెబ్‌సిరీస్
దక్షిణాదిలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు విజయ్ సేతుపతి. పాత్రల ఎంపికలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తనదైన ముద్రతో దూసుకుపోతున్నారు. ఇటీవలే ‘ఫర్జీ’ హిందీ వెబ్‌సిరీస్‌తో ఉత్తరాది ప్రేక్షకులకు చేరువైన ఆయన తొలిసారి తమిళ్ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు.
దక్షిణాదిలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు విజయ్ సేతుపతి. పాత్రల ఎంపికలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తనదైన ముద్రతో దూసుకుపోతున్నారు. ఇటీవలే ‘ఫర్జీ’ హిందీ వెబ్‌సిరీస్‌తో ఉత్తరాది ప్రేక్షకులకు చేరువైన ఆయన తొలిసారి తమిళ్ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ శనివారం చెన్నైలో ప్రారంభమైంది.
ఎమ్. మనికందన్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో కాకా ముైట్టె, ఆందవన్ కట్టాలై, కడైసి వివసై వంటి చిత్రాలతో ఆయన పేరు తెచ్చుకున్నారు. విజయ్ సేతుపతి ఇమేజ్‌కు తగిన విధంగా వినూత్న కథాంశంతో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. తమిళంలో తనకిది తొలి వెబ్‌సిరీస్ అని, ఇక ముందు ఓటీటీలో కూడా తన ప్రయాణం కొనసాగుతుందని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి బాలీవుడ్ చిత్రం ‘జవాన్’లో కీలక పాత్రలో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

