Maharaja | విజయ్ సేతుపతి మైల్స్టోన్ ప్రాజెక్ట్ మహారాజ క్రేజీ ఓటీటీ డీల్
Maharaja | కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. విజయ్ సేతుపతి నటిస్తోన్న సినిమాల్లో ఒకటి మక్కళ్ సెల్వన్ 50 (VJS50). Kurangu Bommai ఫేం నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Maharaja | తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు భాల్లో ఓ వైపు హీరోగా.. మరోవైపు నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఈ స్టార్ హీరో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. విజయ్ సేతుపతి నటిస్తోన్న సినిమాల్లో ఒకటి మక్కళ్ సెల్వన్ 50 (VJS50). మహారాజ టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రానికి Kurangu Bommai ఫేం నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
జూన్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తుండగా.. తెలుగు రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అప్డేట్ కూడా బయటకు వచ్చింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ డిజిటల్‌స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుంది. ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి కేకే నగర్లో సెలూనే షాప్ నిర్వహించే వ్యక్తిగా కనిపించబోతున్నట్టు ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. ఇంట్లో ఉన్న లక్ష్మిని దొంగిలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని వచ్చానని పోలీసులతో అంటాడు విజయ్ సేతుపతి.
లక్ష్మి అంటే నగలా, డబ్బా, డాక్యుమెంట్స్ అంటే అవేవి కాదంటున్నాడు. నీ కూతురు కాదు.. భార్య కాదు.. అక్కాచెల్లెలు కాదంటున్నారు. ఇంతకీ లక్ష్మి అంటే ఎవరయ్యా అంటూ సస్పెన్స్‌లో పెడుతూ సాగుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.
మహారాజా ట్రైలర్..
మహారాజా ఫస్ట్ లుక్ ..
#MaharajaFirstLook@Dir_nithilan @PassionStudios_ @TheRoute @Sudhans2017 @Jagadishbliss @anuragkashyap72 @Natty_Nataraj @mamtamohan @Abhiramiact @AjaneeshB @Philoedit @DKP_DOP @ActionAnlarasu @ThinkStudiosInd @infinit_maze @jungleeMusicSTH @Donechannel1 #VJS50FirstLook #VJS50… pic.twitter.com/7fF5Y2rDao
— VijaySethupathi (@VijaySethuOffl) September 10, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

