Vijay | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ స్టార్డమ్ ఉన్న హీరోల్లో టాప్‌లో ఉంటాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay). ఈ లీడింగ్ హీరోకు తమిళం, తెలుగుతోపాటు ఇతర భాషల్లో మంచి మార్కెట్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సౌతిండియా స్టార్ హీరోల్లో వన్ ఆఫ్ ది లీడింగ్ యాక్టర్‌గా కొనసాగుతున్న విజయ్‌కు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేంటంటే ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో లియో సినిమా చేస్తున్న విజయ్.. దళపతి 68ను కూడా లైన్లో పెట్టాడని తెలిసిందే.
డైరెక్టర్ వెంకట్ ప్రభు, ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కాబోతున్నాయని ట్రేడ్ సర్కిల్ టాక్. కాగా ఈ చిత్రానికి విజయ్ ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్ (Remuneration) తీసుకుంటున్నాడని ఓ వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు సినిమా లాభాల్లో షేర్ కూడా అందుకోబోతున్నాడట. ఇదే నిజమైతే సౌతిండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న స్టార్‌గా విజయ్ రికార్డుల్లోకెక్కడం పక్కా అయినట్టే.
ఇండియాతోపాటు విదేశాల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ సినిమా అంటే దాదాపు శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మకం ద్వారా వచ్చే డబ్బులతో రెమ్యునరేషన్ కవర్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకుల అంచనా. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాది రాష్ట్రాల మార్కెట్‌తో పోలిస్తే రూ.150 కోట్లు ఎక్కువేమి కాదంటున్నారు ట్రేడ్ పండితులు.