Vijay Kiragandur | పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ సలార్ (Salaar). ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. సలార్ రెండు పార్టులుగా వస్తోండగా.. Salaar Part-1 Ceasefire డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది సలార్ టీం. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై కేజీఎఫ్ ఫేం విజయ్ కిరగందూర్ తెరకెక్కిస్తున్నారు. రిలీజ్ సందర్భంగా సలార్ విశేషాలు నిర్మాత మాటల్లోనే..
మీ ప్రయాణం ఎలా షురూ అయింది..?
సలార్ 2021లో షురూ అయింది. కానీ ఊహించని విధంగా కోవిడ్ మొదలైంది.. షూటింగ్‌పై ప్రభావం పడ్డది. పూర్తిస్థాయి షూటింగ్ 2022లో షురూ అయింది. మొత్తం షూటింగ్ 2023 జనవరికల్లా షూటింగ్ పూర్తయింది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. సినిమా ఐదు భాషల్లో విడుదల చేయాలనుకున్నాం.. అప్పటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ నేపథ్యంలో డబ్బింగ్, సీజీఐ వర్క్‌కు అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం పట్టింది. అలా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.
కేజీఎఫ్ 2 విజయం పట్ల ఎలా ఫీలవుతున్నారు..?
కేజీఎఫ్ ప్రాంఛైజీకి అద్భుతమైన స్పందన వచ్చింది. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. ఇప్పుడు మాపై చాలా బాధ్యతగా ఉన్నారు. మరింత ప్రభావవంతంగా సినిమాలు తీయాలనుకున్నాం. అందుకే ఆలస్యమైంది.
హోంబలే ఫిలిమ్స్ నుంచి ప్రతీ సినిమా రెండు పార్టులుగా వస్తోంది.. ఎందుకు..?
నిజం చెప్పాలంటే.. కేజీఎఫ్ నిర్మించే టైంలో సెకండ్ పార్టు ఆలోచన లేదు. కొన్ని రోజుల షూట్ తర్వాత సినిమా రెండు పార్టులుగా తీయాల్సిన అవసరముందని డైరెక్టర్ చెప్పారు. కానీ కాంతార విషయంలో ఇలాంటి సారుప్యత లేదు. కర్ణాటక సంప్రదాయం ఆధారంగా తెరకెక్కిన కాంతారను ఇతర ప్రాంతాల ప్రజలు చూస్తారా.. అనే డౌటు ఉండేది. కాంతార కథ సినిమా రెండు, మూడు పార్టులుగా ఉండేలా డిమాండ్ చేస్తుంది. ఇదే ఫార్ములా సలార్‌కు కూడా వర్తిస్తుంది.
మీరు కథ ఒకే చేసేటపుడు ఏ కోణంలో ఆలోచిస్తారు..?
బడ్జెట్ గురించి ఆలోచించను. నేను కేవలం సినిమా కాన్సెప్ట్, కంటెంట్‌పైనే ఫోకస్ పెడతా. డైరెక్టర్ ఎవరు..? స్కిల్స్ ఏంటనేది చూస్తా. స్టోరీ సీక్వెన్స్ సరైనదా..? కాదా..? ఆలోచిస్తా. నా విషయంలో కంటెంట్, డైరెక్టర్‌పైనే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తా.
సలార్‌పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.. ఎలా అనిపిస్తుంది..?
ప్రభాస్ సూపర్ స్టార్. చాలా రాష్ట్రాల్లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న పెద్ద డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ ఇద్దరు కలిశారంటే అంచనాల సరిహద్దులు దాటిపోతాయి. సలార్ ప్రేక్షకుల అంచనాలు చేరుకుంటుంది.
గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించకపోవడానికి కారణం..?
మేం టైంకు వ్యతిరేకంగా పరుగెడుతున్నాం. ప్రభాస్, ప్రశాంత్ నీల్ ప్రస్తుతం చాలా బిజీ. మేం త్వరలోనే గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ నిర్వహిస్తాం.