Leo | తెలుగు రాష్ట్రాల్లో లియో క్రేజ్.. భారీస్థాయిలో విడుదలకు ప్లాన్
Leo | ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తమిళంలో కూడా అడుగుపెట్టి చిత్ర నిర్మాణాలు చేపట్టాడానికి ఆసక్తి చూపిస్తుంది. ఇటీవల ధనుష్ ‘సార్' (తమిళంలో వాతి)తో తమిళ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ మరో భారీ బడ్జెట్ తమిళ చిత్రం ‘లియో’లో భాగస్వాములు కాబోతున్నారు.
Leo | ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తమిళంలో కూడా అడుగుపెట్టి చిత్ర నిర్మాణాలు చేపట్టాడానికి ఆసక్తి చూపిస్తుంది. ఇటీవల ధనుష్ ‘సార్’ (తమిళంలో వాతి)తో తమిళ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ మరో భారీ బడ్జెట్ తమిళ చిత్రం ‘లియో’లో భాగస్వాములు కాబోతున్నారు. తమిళ క్రేజీ కథానాయకుడు విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయిక. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకుడు.ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తూ పంపిణీ రంగంలోకి కూడా అడుగుపెట్టబోతుంది సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘ఇటీవలే ఈ చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ‘లియో’ చిత్రంతో పంపిణీ రంగంలోకి అడుగుపెట్టడం సంతోషంగా వుంది. హీరో విజయ్ పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని తెలుగులో ఆయన చిత్రాలకు మునుపెన్నడూ లేని విధంగా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

