GOAT Movie | తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’(GOAT). ఈ సినిమాకు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక రీసెంట్గా సినిమా తేదీని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను సెప్టెంబర్ సెప్టెంబర్ 05న వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే తాజాగా మూవీ నుంచి మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విజిల్ పోడు అనే సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఫుల్ మాస్ బీట్తో సాగిన ఈ పాటను స్వయంగా విజయ్ పాడడం విశేషం. మధన్ కార్కి సాహిత్యం అందించిన ఈ పాటకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.
ఇక ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కల్పతి ఎస్ అఘోరం నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రష్యాలో జరుపుకుంటుంది. రష్యాలో విజయపై యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మీనాక్షి చౌదరి, వైభవ్, ప్రేమి అమరెన్, యుగేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.