TN Cm Vijay | ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ఆదివారం నాడు తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక ఘట్టంతో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ద్రవిడ పార్టీల (DMK, AIADMK) ఆధిపత్యానికి తెరపడింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు సీఎంవో (CMO Tamil Nadu ) అధికారిక ఎక్స్ (X) ఖాతాతో పాటు ఇతర ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే తమిళనాడు సీఎంవో ఎక్స్ అకౌంట్ ప్రొఫైల్ ఫోటో మరియు కవర్ ఇమేజ్ మార్చారు అధికారులు. దీంతో అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున సీఎంవో ఖాతాను ట్యాగ్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతుండటంతో ఇది ట్రెండింగ్లోకి వచ్చింది. ప్రస్తుతం తమిళనాడు సీఎంవో ఖాతాతో పాటు ఇన్స్టా ఖాతా, ఫేస్బుక్ ఖాతాలు విపరీతంగా ట్రెండింగ్లో నడుస్తున్నాయి.
#NewProfilePic pic.twitter.com/qfXpucyPuC
— CMOTamilNadu (@CMOTamilnadu) May 10, 2026