Ranabaali Teaser Locked | రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ట్యాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్ను ప్రకటించారు. సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చేలా రూపొందించిన ఈ చిత్ర టీజర్‌ను సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 4:05 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది. ది లెజెండ్ ఆఫ్ ది కర్సడ్ ల్యాండ్ రైజెస్ అనే క్యాప్షన్‌తో వస్తున్న ఈ అప్డేట్ ప్రస్తుతం నెట్టింట విశేషంగా వైరల్ అవుతోంది.
1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ కాలం నాటి వాస్తవిక చారిత్రక సంఘటనలు, అణచివేతకు వ్యతిరేకంగా సాగే పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్-ఇండియా చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా, ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి టి-సిరీస్ సమర్పిస్తుండగా, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్-అతుల్ అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ పీరియడ్ డ్రామాను దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ఖరారు చేశారు.
REVEALING THE SAVAGE’S OATH 🔥⚔️#RanabaaliTeaser out tomorrow at 4.05 PM ❤🔥#Ranabaali GRAND RELEASE WORLDWIDE ON 16.10.26.#NeverForget#RanabaaliOnOct16th@TheDeverakonda @iamRashmika @Rahul_Sankrityn @MythriOfficial #ArnoldVosloo @AjayAtulOnline @nirav_dop… pic.twitter.com/580oz1SsEa
— RANABAALI (@RanabaaliFilm) September 8, 2026