Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Vijay Deverakonda | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన సినిమా వేదికగా సమాజానికి ఒక కీలకమైన సామాజిక సందేశాన్నిచ్చారు.
Vijay Deverakonda | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన సినిమా వేదికగా సమాజానికి ఒక కీలకమైన సామాజిక సందేశాన్నిచ్చారు. తన తాజా చిత్రం ‘రణబాలి’ (Ranabaali) ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే కాలంలో రానున్న ప్రకృతి ముప్పు పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం ఎదుర్కోంటున్న ‘సూపర్ ఎల్ నినో’ (Super El Nino) ప్రభావం గురించి విజయ్ ప్రస్తావించారు. సరిగ్గా 150 సంవత్సరాల క్రితం ఇలాంటిదే ఒక సూపర్ ఎల్ నినో ఏర్పడి, నాటి చారిత్రక ‘గ్రేట్ మద్రాస్ కరువు’ (Great Madras Famine)కు కారణమైందని, అప్పట్లో బ్రిటిష్ పాలకులు చేసిన విధానాల వల్ల సుమారు 80 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తుచేశారు.
ఇప్పుడు అదే విపత్తు మళ్లీ ఒక సైకిల్ మాదిరిగా రిపీట్ అయ్యే అవకాశం ఉందని, మన పూర్వీకులు పడిన ఆ కష్టాలను మనం మళ్లీ ఎదుర్కోకుండా ఉండేందుకు ఇప్పుడే అప్రమత్తం కావాలని విజయ్ తెలిపారు. రాబోయే ఒక సంవత్సరం పాటు ప్రతి ఒక్కరూ అత్యంత బాధ్యతాయుతంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా నీటిని, విద్యుత్‌ను, ఆహారాన్ని ఎంతో పొదుపుగా వాడాలని, ఏ ఒక్కదానిని కూడా వృథా చేయకుండా జాగ్రత్తపడాలని ఆయన ప్రజలను హృదయపూర్వకంగా అభ్యర్థించారు. ప్రకృతి విపత్తులను, కరువును ఎదుర్కొనే సత్తా మన భారతీయుల్లో ఉందని, అందరం కలిసికట్టుగా వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఈ సంక్షోభాన్ని దాటాలని విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

