Vijay Deverakonda | ఎవరేమనుకున్నా సరే ఆ ఫీట్ సాధించి చూపిస్తా!
Vijay Deverakonda | ‘పెళ్లి చూపులు’ నుంచి ‘ఫ్యామిలీ స్టార్' వరకు నేను చేసిన ప్రతి సినిమా ఏదో కొత్త విషయాన్ని నేర్పించింది. ఇదొక ప్రయాణం. ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదురవుతుంటాయి. అవన్నీ దాటుకొని మనం అనుకున్నది సాధించాలి. మనకు లక్ష్యం మాత్రమే కనిపించాలి’ అన్నారు విజయ్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ‘ఫ్యామిలీ స్టార్' చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకురానుంది.
Vijay Deverakonda | ‘పెళ్లి చూపులు’ నుంచి ‘ఫ్యామిలీ స్టార్’ వరకు నేను చేసిన ప్రతి సినిమా ఏదో కొత్త విషయాన్ని నేర్పించింది. ఇదొక ప్రయాణం. ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదురవుతుంటాయి. అవన్నీ దాటుకొని మనం అనుకున్నది సాధించాలి. మనకు లక్ష్యం మాత్రమే కనిపించాలి’ అన్నారు విజయ్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం మైసమ్మగూడలోని నరసింహా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘వందకోట్ల కలెక్షన్స్ వచ్చే సినిమా చేయాలన్నది ఒకప్పటి నా డ్రీమ్. అది నాలుగో చిత్రం ‘గీత గోవిందం’తో నెరవేరింది.
నేను చేసిన ఓ సినిమా రెండొందల కోట్లు రాబడుతుందని చెప్పాను. అలా మాట్లాడటం అహంకారం అనుకునే ప్రమాదం ఉందని చాలా మంది పెద్దలు నాతో చెప్పారు. రెండొందల కోట్ల కలెక్షన్స్ సినిమా చేస్తాననడం తప్పుకాదు. అలా చెప్పి సాధించకపోవడం తప్పు. ఎవరు ఏమనుకున్నా రెండొందల కోట్ల రూపాయల సినిమా చేస్తా. ఇది బలుపు, అహంకారం అనుకున్నా సరే. అది నా మీద నాకున్న నమ్మకం. విశ్వాసం. మరొకరు సాధించగా లేనిది మనమెందుకు సాధించలేమనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నా. మీరందరూ కలలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నించండి’ అన్నారు. మన కుటుంబాల్లోని ఎమోషన్స్ అన్నీ కలబోసి తీసిన సినిమా ఇదని, అందరికి నచ్చుతుందని, విజయ్ క్యారెక్టర్‌ను దర్శకుడు అద్భుతంగా డిజైన్ చేశాడని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. కథలోని ఎమోషన్స్‌కు ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతారని, సినిమా కోసం రాసిన ప్రతీ మాట తన గుండెల్లోంచి వచ్చిందేనని దర్శకుడు పరశురామ్ అన్నారు. ఈ సినిమాను తన ఫ్యామిలీ స్టార్ అయిన నాన్నకు అంకితమిస్తున్నానని కథానాయిక మృణాల్ ఠాకూర్ చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

