Vijay Devarakonda | మ్యారేజ్ లైఫ్ గురించి విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Vijay Devarakonda | ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. ఎలాంటి భేషజాలకు తావులేకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతాడు. అందుకే ఆయన్ని అభిమానులు రౌడీ హీరో అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.
Vijay Devarakonda | ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. ఎలాంటి భేషజాలకు తావులేకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతాడు. అందుకే ఆయన్ని అభిమానులు రౌడీ హీరో అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. తాజాగా విజయ్ దేవరకొండ పెళ్లి గురించి చేసిన కామెంట్స్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన తాజా చిత్రం ‘ఖుషి’ నుంచి ‘ఆరాధ్య’ అనే పాటను ఇటీవలే విడుదల చేశారు. ఇందులో పెళ్లి తర్వాత జంట మధ్య ఉండే అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ పాట గురించి విజయ్ దేవరకొండ సోషల్‌మీడియా వేదికగా స్పందించారు.
“ఖుషి’ సినిమాలో నాకు ఇష్టమైన పాట ఇది. పెళ్లయిన ఏడాది లోపు భార్యభర్తలు ఎలా ఉండాలో చక్కగా చూపించారు. వారి మధ్య అనుబంధాన్ని కూడా బ్యూటీఫుల్‌గా ప్రజెంట్ చేశారు. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ..భవిష్యత్తులో నా మ్యారేజ్ లైఫ్ ఈ పాటలో ఉన్నట్లే ఉండాలని కోరుకుంటున్నా’ అని విజయ్ దేవరకొండ తెలిపారు. ఆయన పోస్ట్ చూసిన అభిమానులు త్వరగా పెళ్లి వార్త చెబితే బాగుంటుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

