‘ఖుషి’ సక్సెస్ ఆనందం సమంతలో చూడాలి
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. సెప్టెంబరు 1న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం సంగీత విభావరి కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సింగర్స్ జావేద్ అలీ, సిధ్ శ్రీరామ్, మంజుష, చిన్మయ, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ పాటలు పాడి ఆకట్టుకున్నారు.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. సెప్టెంబరు 1న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం సంగీత విభావరి కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సింగర్స్ జావేద్ అలీ, సిధ్ శ్రీరామ్, మంజుష, చిన్మయ, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ పాటలు పాడి ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలోని టైటిల్‌సాంగ్‌లో విజయ్ దేవరకొండ, సమంత లైవ్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్‌ను అలరించింది.
ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘నాతో ప్రతిసారి దర్శకుడు ‘నీ మోహంలో నవ్వు చూడాలి విజయ్ బ్రో.. అదొక్కటి గుర్తుపెట్టుకుని పనిచేస్తున్నా’ అనేవాడు. దర్శకుడు ఈ సినిమాను ఎంత ప్రేమించి చేశాడో సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ సినిమా సక్సెస్ సంతోషం నా ఫేస్‌లో కాదు సమంతలో చూడాలి. ఈ చిత్రం విజయంతో నన్ను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరి ఫేస్‌లో ఆనందం చూడాలనుకుంటున్నాను’ అన్నారు. సమంత మాట్లాడుతూ ‘మేమొప్పుడూ మీ అందరికి నచ్చే సినిమా ఇవ్వాలని కోరుకుంటాం. ఈ సినిమాతో అలాంటి ప్రయత్నమే చేశాం. నా కెరీర్లో మేమెరబుల్ మూవీగా ఇది మిగిలిపోతుంది.మీరు చూపించే ప్రేమతో ఆరోగ్యంతో తిరిగివస్తా. బ్లాక్‌బస్టర్ ఇస్తాను’ అన్నారు. నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ “ఖుషి’ సినిమాపై చాలా నమ్మకంతో వున్నాం. ఈ చిత్రంతో విజయ్‌కు బ్లాక్‌బస్టర్‌ను ఇవ్వబోతున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘ఖుషి’ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

