Vijay Deverakonda | సాహిబా ప్రేమలో మునిగితేలుతున్న విజయ్ దేవరకొండ
అగ్ర హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం భారీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ‘సాహిబా’ పేరుతో హిందీ మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించారు. ‘హీరియే..’ గీతంతో పాపులర్ అయిన స్వరకర్త, గాయని జస్లీన్ రాయల్ ఈ పాటను కంపోజ్ చేయడం విశేషం.
Vijay Deverakonda | అగ్ర హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం భారీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ‘సాహిబా’ పేరుతో హిందీ మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించారు. ‘హీరియే..’ గీతంతో పాపులర్ అయిన స్వరకర్త, గాయని జస్లీన్ రాయల్ ఈ పాటను కంపోజ్ చేయడం విశేషం. ఈ గీతంలో విజయ్ దేవరకొండకు జోడీగా రాధిక మదన్ నటించారు. సుధాంశు సరియా దర్శకత్వం వహించారు. శుక్రవారం ఈ ఆల్బమ్‌ను విడుదల చేశారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మెలోడీ ప్రధానంగా ప్రేమలోని సున్నిత భావోద్వేగాల్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది.
ఇందులో విజయ్ దేవరకొండ ఫొటోగ్రాఫర్‌గా కనిపించారు. ‘హిరీయే..’ గీతం తరహాలోనే ‘సాహిబా’ సైతం సంగీత ప్రపంచంలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని మ్యూజిక్ డైరెక్టర్ జస్లీన్ రాయల్ ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే కేరళలో ఓ షెడ్యూల్ జరిగింది. ఈ సినిమాతో పాటు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్నారు విజయ్ దేవరకొండ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

