నా కెరీర్లో గర్వపడే సినిమా ‘రణబాలి’
‘ఇది నా 14వ సినిమా. ముప్పై సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక సినిమా గురించి, అందులోని పర్ఫార్మెన్స్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటారు.
‘ఇది నా 14వ సినిమా. ముప్పై సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక సినిమా గురించి, అందులోని పర్ఫార్మెన్స్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. అలాంటి చిత్రమే ‘రణబాలి’. ఈ సినిమా చేస్తున్నప్పుడు పెద్ద హిట్ కొట్టాలి.. బాక్సాఫీస్ వద్ద పెద్ద నెంబర్స్ క్రియేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోలేదు. అందరికి చెప్పాల్సిన కథ అనిపించింది. నా కెరీర్లో గర్వపడే సినిమా అవుతుంది’ అన్నారు అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ.
ఆయన తాజా చిత్రం ‘రణబాలి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి వచ్చిన బెస్ట్ఫిల్మ్ ఇదని చెప్పగలను.
సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో ఓ రొమాంటిక్ సినిమా చేయబోతున్నా. మంచి స్క్రిప్ట్ కుదిరింది. ఇప్పుడు నేను చేస్తున్న ప్రతీ సినిమా ఇష్టపడే చేస్తున్నా’ అన్నారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే పోరాడాలనే స్ఫూర్తిని అందించే చిత్రమిదని..ఇందులో రణబాలి, జయమ్మ పాత్రలను తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నదని కథానాయిక రష్మిక మందన్న పేర్కొన్నది.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం ఉందని, ఫ్యామిలీ ఆడియెన్స్ మంచి ఆదరణ కనబరుస్తున్నారని నిర్మాత రవిశంకర్ అన్నారు. ఏపీ, తెలంగాణలోని అన్ని ఏరియాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, విజయ్ దేవరకొండ కెరీర్లో భారీ హిట్‌గా నిలుస్తుందని నిర్మాత నవీన్ యెర్నేని చెప్పారు. సినిమా తీసిన మంచి ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకొని ఆదరిస్తున్న ప్రేక్షకులకు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తొలి రోజు ఐదు వికెట్లు తీసిన భారత్.. కివీస్ స్కోర్ ఎంతంటే..!
Alias Rukmini Trailer | పగలు కోర్టులో స్టెనోగ్రాఫర్, రాత్రి రొమాంటిక్ రచయిత.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్!
Bomb Cyclone effect | బాంబ్ సైక్లోన్‌తో అమెరికా ఉక్కిరిబిక్కిరి.. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు..!
ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులా? కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ: నాగరాజు గుర్రాల
Jithu Madhavan | టాలీవుడ్లోకి ‘సీన్’ డైరెక్టర్ ఎంట్రీ.. మైత్రీ మూవీ మేకర్స్‌తో భారీ ప్రాజెక్ట్, హీరో ఎవరంటే?
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

